Labels

Wednesday, March 1, 2017

స్వాగతం


   తెలుగు శాఖకు స్వాగతం

 తెలుగు శాఖ, ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడ - 08.


Tuesday, February 28, 2017

WiKi


Telugu Syllabus 2018-2019


ఆంధ్ర లొయోల కళాశాల
-  తెలుగు వికీపీడియ                    

-         డా. కోలా శేఖర్‌ 





                     ‘‘ఈ దాహం తీరనిది...’’ అని ఒక సినీకవి అంటాడు. 60 వసంతాలు  పూర్తి చేసుకున్న ‘‘లొయోల’’ ప్రతి వసంతంలోనూ ఎన్నో విజయ ఐరావతాలను అధిరోహించింది. అయినా ‘‘దాహం’’ తీరలేదు. 61 వ వసంతంలోనూ  సంచలనాను తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే ఇప్పటి విజయ పరంపర కాస్త భిన్నమైంది. సంచనమైనది. మరెవరూ అందుకోలేనిది. ఎవరికీ అందనిది. 

                  ‘‘ఫ్రెంచ్‌ కిరీటం నేలపై పడి ఉండగా నేను నా కత్తితో దాన్ని పైకెత్తాను’’ అంటూ ధీరత్వాన్ని నెపోలియన్‌ ప్రకటించాడు నాడు. క్రీ.శ.1953 ప్రాంతంలో విజయవాడ నుంచి ప్రముఖ విద్యాసంస్థలు  తరలిపోతుంటే విద్యా కిరీటాన్నిప్రేమతో లొయోలతకెత్తుకుంది. అది చరిత్ర. నేడు అంతర్జాలం (ఇంటర్నెట్‌) లో స్వేచ్ఛగా వాడుకోగ విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే మహత్కార్యానికి శ్రీకారంచుట్టింది. అసంఖ్యాక తెలుగు ఇంటర్నెట్‌ వాడుకరులకు స్వేచ్ఛా విజ్ఞానాన్ని  తెలుగు వికీపీడియాద్వారా ఉచితంగా అందిస్తుంది.

                     వికీపీడియా అందరికీ విదితమే. 287 భాషలో 3 కోట్ల వ్యాసాలతో ఎవరయినా సమాచారాన్ని నలు గురితో పంచుకునే విధంగా పనిచేసే ఈ బృహద్విజ్ఞాన సర్వస్వం జనవరి 2001లో  మొదలయింది. తెలు గు వికీపీడియా డిసెంబర్‌ 2003 లో మొదలయి, మొన్నీ మధ్యనే తిరుపతిలో 11 వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. వికీపీడియా సోదర ప్రాజెక్టుగా ఉన్న వికీసోర్స్‌  ముఖ్య లక్ష్యం ఇంటర్నెట్‌ ద్వారా ఉచితంగా పుస్తకాలను అందుబాటులో ఉంచడం. అంతర్జాల స్వేచ్ఛా గ్రంథాలయం. ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 57000 వ్యాసాలు, వికీసోర్స్‌ లో 9600 పేజీలు, 100 పుస్తకాలు  అందుబాటులో ఉన్నాయి.

                        తెలుగు అంతర్జాంలో అప్రతిహతంగా జైత్రయాత్రను సాగిస్తున్న వికీపీడియాతో ఆంధ్ర లొయోల  కళాశాలజతకలిసింది. భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడుతోడైతే ఎంజరిగిందో అందరికి తెలిసిందే. అది గతం. నేడు లొయోలరాకతో 57000 వ్యాసాు 60000 వ్యాసాలుగా, 9600 పేజీలు 10000 పేజీలుగా అతి కొద్దికాంలోనే ఎదిగాయి. తెలుగు అంతర్జాల  చరిత్రలోనే ఇది ఒక సంచనం. ఈ కలయిక యాదృచ్ఛికంగా జరగలేదు.

                     వికీపీడియా కార్యక్రమాలను మొదటి నుంచి భారతదేశంలో బెంగుళూరు లోని ది సెంటర్‌ ఫర్‌ ఇంటర్నెట్‌ అండ్‌ సొసైటీ’ (సీఐఎస్‌) వారు నిర్వహిస్తూవున్నారు. సీఐఎస్‌ వికీపీడియా సంబంధిత కార్యక్రమాలు చేపట్టేందుకు  ఏక్సెస్‌ టు నాలెడ్జ్‌’ (2 కే) అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఉన్నత విద్యా సంస్థలను సంప్రదించి, విద్యార్థులకు వికీపీడియాను వాడటంలో శిక్షణ ఇవ్వటం ద్వారా విద్యార్థుల కు పరిశోధనా కౌశలాన్ని పెంచడం 2 కేచేస్తున్న మరో పని.

                 ఆంధ్ర లొయోల కళాశాలలో వికీపీడియా (సీఐఎస్‌`2 కే) కార్యక్రమాలు జూన్‌ 2014 న అధ్యాపకుల కార్యశాల (వర్క్‌ షాప్‌) ద్వారా మొదలయ్యాయి. ఆ కార్యక్రమంలో దాదాపు 60 మంది వివిధ కళాశాలలకు సంబంధించిన అధ్యాపకులు వికీపీడియాపై శిక్షణ ఇవ్వటం జరిగింది. ఆ వెంటనే 100 మంది విద్యార్థులకు వికీపీడియా ఎడిటింగ్‌పై మరొక కార్యశాల జరిగింది. వీటిని స్ఫూర్తిగా తీసుకొని, ప్రిన్సిపల్‌ ఫాదర్‌ డా.జి.ఏ.పి.కిశోర్‌ యస్‌.జె.గారి చొరవతో ఆగస్టు 2014 లో ఆంధ్ర లొయోల కళాశాల `సెంటర్‌ ఫర్‌ ఇంటర్నెట్‌ అండ్‌ సొసైటీ’ (ఏక్సెస్‌ టు నాలెడ్జ్‌ ` వికీపీడియా) మధ్య సంస్థాగత భాగస్వామ్య ఒప్పందం (MoU) కుదిరింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఒక విద్యా సంస్థ ఈ తరహా సంస్థాగత భాగస్వామ్యంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే ఐదేళ్ళలో ఆంధ్ర లొయోల కళాశాల వికీపీడియాతో కలి సి పనిచేస్తుంది.




                 వికీ కార్యక్రమానలు వేగవంతంచేస్తూ ఫాదర్‌ ప్రిన్సిపల్‌ చైర్మన్‌గా, వివిధ విభాగాల నుంచి ఎంపిక చేసిన 10 మంది అధ్యాపకుతో ఒక కార్యవర్గం రూపుదిద్దుకుంది. ఆ తరువాత రహ్మానుద్దీన్‌ షేక్‌ (ప్రోగ్రాం  ఆఫీసర్‌) గారి పర్యవేక్షణలో వికీ వింటర్‌ క్యాంప్‌డిసెంబర్‌ 26 నుంచి 31 వరకు జరిగింది. బోటనీ, సాంఖ్యాక శాస్త్రం, భౌతిక శాస్త్రం, తెలుగు శాఖ నుంచి 45 మంది విద్యార్థులు కార్యశాలలో పాల్గొన్నారు. వీరు తెలుగు వికీపీడియా (తెవికీ) లో తెలుగులో వ్యాసాలు రాయటం, దిద్దటం, చిత్రాలు పొందుపరచటం, లింకులను, వనరులను, మూలాలను చేర్చటంలో శిక్షణ పొందారు.





               ‘బోటనీవిద్యార్థు తెవికీలో లేని దాదాపు 100 వృక్షసంపదకు సంబంధించిన సమాచారాన్ని, వాటి సహజ చిత్రాను, హెర్బేరియం చిత్రాలను వాడుకరులకు అందించే ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. సాంఖ్యాక శాస్త్ర’  విద్యార్థులు రెండు తెలుగు భాషా రాష్ట్రా విశ్వవిద్యాలయాల  పరిధిలోని ప్రథమ సంవత్సరం డిగ్రీ స్థాయి సాంఖ్యాక శాస్త్రంపాఠ్య ప్రణాళికకు అనుగుణంగా పాఠ్యాంశాల ప్రణాళికను సిద్ధం చేశారు. పది వ్యాసాను తెవికీలో అందు బాటులోవుంచారు. భౌతిక శాస్త్రవిద్యార్థులు ప్రాథమిక భౌతిక శాస్త్రానికి సంబంధించిన 108 వ్యాసాలను, 200 పేజీలో సంపూర్ణ సమాచారాన్ని చిత్రాలతో తెవికీలో చేర్చారు. ఈ తెవికీ ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకొని తగిన జ్ఞానార్జన మాతృభాషలో చేయాన్న ఉద్దేశంతో ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది. 




                     ‘ప్రత్యేక తెలుగు’ (Special Telugu) విద్యార్థులు 15 మంది రచయితలను గూర్చి వ్యాసాలను రచించి, తెవికీలో పొందుపరిచారు. వికీసోర్స్‌ లో ప్రముఖ కవుల ఆధ్యాత్మిక, సాంఘికాంశాలకు చెందిన 12 గ్రంథాలను డిజిటైజ్‌ చేశారు. అంతే కాకుండా ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత కందుకూరి వీరేశలింగం గారి 24 అరుదైన రచనలను డిజిటైజ్‌ చేశారు. వీటిల్లో చాలా వరకు ప్రస్తుతం బయట అందుబాటులో లేనివే. ఈ విధంగా డిజిటైజ్‌ అయిన కందుకూరి వీరేశలింగం గారి రచనలు తెలుగు వికీసోర్స్‌ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా చదువరులకు అందుబాటులోనికి వచ్చాయి. తెలుగులో ఇటువంటి ప్రయత్నం ఇదే తొలిసారి. మిగిలిన వీరి రచనలన్నీ డిజిటైజ్‌ చేసే కార్యక్రమం శరవేగంగా జరుగుతూవుంది. ప్రత్యేక తెలుగువిద్యార్థులు ఇప్పటి వరకు తెలుగు వికీపీడియా, వికీసోర్స్‌ లో మొత్తం 3200 పేజీలను పొందుపరిచారు.





                     ‘‘ఏ దిల్‌ మాంగే మోర్‌’’ ప్రముఖ శీతపానియం నినాదం. ఇది ‘‘ఆంధ్ర లొయోల కళాశాల’’ కు సరిగ్గా  సరిపోతుంది. 60 వసంతాల్లో ఎన్నో రికార్డులను తిరగరాసిన లొయోలమరో సుస్థిరమైన రికార్డును 61 వ వసంతంలో ఇంటర్నెట్‌ వేదికగా నేలక్పొటం ముదావహం. ఈ కార్యక్రమాల వలన తెలుగు భాషలో వివిధ అంశాలకు చెందిన జ్ఞానం అందుబాటులోకి రావటమే కాకుండా, మాతృభాషా పరిరక్షణలో ఇది ఒక మైలురాయిగా కళాశాల చరిత్రలో నిలిచిపోనుంది.  
                      
               తెవికీలో లొయోలతొలి అడుగు విద్యా రంగానికి నూతన కవాటాన్ని సృష్టిస్తే, మలి అడుగు జైత్రయాత్రకు పునాది కావాలని ఆకాంక్షిస్తున్నాం.   






  



Faculty Information

Name: Dr. Kola Sekhar, HOD Qualification: MA (Telugu), M.Phil, Ph.D, UGC-NET, PGDCA Mobile No: 9441441097 Mail: kolasekhara@gmail.com Name:D...