Wednesday, March 1, 2017
Tuesday, February 28, 2017
WiKi
లింకులు :
వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాలవికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల/తెలుగు
వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల/వికీసోర్స్ తోడ్పాటు
- డా. కోలా శేఖర్
వికీపీడియా కార్యక్రమాలను మొదటి నుంచి భారతదేశంలో బెంగుళూరు లోని ‘ది సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ’ (సీఐఎస్) వారు నిర్వహిస్తూవున్నారు. సీఐఎస్ వికీపీడియా సంబంధిత కార్యక్రమాలు చేపట్టేందుకు ‘ఏక్సెస్ టు నాలెడ్జ్’ (ఏ 2 కే) అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఉన్నత విద్యా సంస్థలను సంప్రదించి, విద్యార్థులకు వికీపీడియాను వాడటంలో శిక్షణ ఇవ్వటం ద్వారా విద్యార్థుల కు పరిశోధనా కౌశలాన్ని పెంచడం ‘ఏ 2 కే’ చేస్తున్న మరో పని.
ఆంధ్ర లొయోల కళాశాలలో వికీపీడియా (సీఐఎస్`ఏ 2 కే) కార్యక్రమాలు జూన్ 2014 న అధ్యాపకుల కార్యశాల (వర్క్ షాప్) ద్వారా మొదలయ్యాయి. ఆ కార్యక్రమంలో దాదాపు 60 మంది వివిధ కళాశాలలకు సంబంధించిన అధ్యాపకులు వికీపీడియాపై శిక్షణ ఇవ్వటం జరిగింది. ఆ వెంటనే 100 మంది విద్యార్థులకు వికీపీడియా ఎడిటింగ్‌పై మరొక కార్యశాల జరిగింది. వీటిని స్ఫూర్తిగా తీసుకొని, ప్రిన్సిపల్ ఫాదర్ డా.జి.ఏ.పి.కిశోర్ యస్.జె.గారి చొరవతో ఆగస్టు 2014 లో ‘ఆంధ్ర లొయోల కళాశాల `సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ’ (ఏక్సెస్ టు నాలెడ్జ్ ` వికీపీడియా) మధ్య సంస్థాగత భాగస్వామ్య ఒప్పందం (MoU) కుదిరింది. నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఒక విద్యా సంస్థ ఈ తరహా సంస్థాగత భాగస్వామ్యంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే ఐదేళ్ళలో ఆంధ్ర లొయోల కళాశాల వికీపీడియాతో కలి సి పనిచేస్తుంది.
వికీ కార్యక్రమానలు వేగవంతంచేస్తూ ఫాదర్ ప్రిన్సిపల్ చైర్మన్‌గా, వివిధ విభాగాల నుంచి ఎంపిక చేసిన 10 మంది అధ్యాపకుతో ఒక కార్యవర్గం రూపుదిద్దుకుంది. ఆ తరువాత రహ్మానుద్దీన్ షేక్ (ప్రోగ్రాం ఆఫీసర్) గారి పర్యవేక్షణలో ‘వికీ వింటర్ క్యాంప్’ డిసెంబర్ 26 నుంచి 31 వరకు జరిగింది. బోటనీ, సాంఖ్యాక శాస్త్రం, భౌతిక శాస్త్రం, తెలుగు శాఖ నుంచి 45 మంది విద్యార్థులు కార్యశాలలో పాల్గొన్నారు. వీరు తెలుగు వికీపీడియా (తెవికీ) లో తెలుగులో వ్యాసాలు రాయటం, దిద్దటం, చిత్రాలు పొందుపరచటం, లింకులను, వనరులను, మూలాలను చేర్చటంలో శిక్షణ పొందారు.
‘బోటనీ’ విద్యార్థు తెవికీలో లేని దాదాపు 100 వృక్షసంపదకు సంబంధించిన సమాచారాన్ని, వాటి సహజ చిత్రాను, హెర్బేరియం చిత్రాలను వాడుకరులకు అందించే ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. ‘సాంఖ్యాక శాస్త్ర’ విద్యార్థులు రెండు తెలుగు భాషా రాష్ట్రా విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రథమ సంవత్సరం డిగ్రీ స్థాయి ‘సాంఖ్యాక శాస్త్రం’ పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా పాఠ్యాంశాల ప్రణాళికను సిద్ధం చేశారు. పది వ్యాసాను తెవికీలో అందు బాటులోవుంచారు. ‘భౌతిక శాస్త్ర’ విద్యార్థులు ప్రాథమిక ‘భౌతిక శాస్త్రా’నికి సంబంధించిన 108 వ్యాసాలను, 200 పేజీలో సంపూర్ణ సమాచారాన్ని చిత్రాలతో తెవికీలో చేర్చారు. ఈ తెవికీ ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకొని తగిన జ్ఞానార్జన మాతృభాషలో చేయాన్న ఉద్దేశంతో ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది.
‘ప్రత్యేక తెలుగు’ (Special Telugu) విద్యార్థులు 15 మంది రచయితలను గూర్చి వ్యాసాలను రచించి, తెవికీలో పొందుపరిచారు. వికీసోర్స్ లో ప్రముఖ కవుల ఆధ్యాత్మిక, సాంఘికాంశాలకు చెందిన 12 గ్రంథాలను డిజిటైజ్ చేశారు. అంతే కాకుండా ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత కందుకూరి వీరేశలింగం గారి 24 అరుదైన రచనలను డిజిటైజ్ చేశారు. వీటిల్లో చాలా వరకు ప్రస్తుతం బయట అందుబాటులో లేనివే. ఈ విధంగా డిజిటైజ్ అయిన కందుకూరి వీరేశలింగం గారి రచనలు తెలుగు వికీసోర్స్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా చదువరులకు అందుబాటులోనికి వచ్చాయి. తెలుగులో ఇటువంటి ప్రయత్నం ఇదే తొలిసారి. మిగిలిన వీరి రచనలన్నీ డిజిటైజ్ చేసే కార్యక్రమం శరవేగంగా జరుగుతూవుంది. ‘ప్రత్యేక తెలుగు’ విద్యార్థులు ఇప్పటి వరకు తెలుగు వికీపీడియా, వికీసోర్స్ లో మొత్తం 3200 పేజీలను పొందుపరిచారు.
Tuesday, August 6, 2013
PROFILE
తెలుగు శాఖ
Courses offered : GENERAL TELUGU ( I, II )
Salient features of the Department :
తెలుగు శాఖాధిపతి
- డా. ఆర్. రవీంద్ర భాస్, M.A., M.Phil, Ph.D. UNIVERSITY OF HYDERABAD
- డా. డి. కృపారావు M.A., Ph.D., UGC-NET. ANDHRA UNIVERSITY
- శ్రీ కె. జోసఫ్ M.A., UGC-NET.
- డా. బి. సుబ్బారావు M.A., Ph.D. UGC-NET. ACHARYA NAGARJUNA UNIVERSITY
- శ్రీ అమృతరావు M.A., UGC-JRF. (Ph.D) UNIVERSITY OF HYDERABAD
Activities 2018-2019
SYLLABUS 2020-2021
బి.ఏ., బి.బి.ఏ., బి.కాం., బి.ఎస్.సి. తదితర ప్రోగ్రాములు
అంశం: జనరల్ తెలుగు సెమిస్టర్- I
కోర్సు- I: ప్రాచీన తెలుగు కవిత్వం
యూనిట్ల సంఖ్య: 5 పీరియడ్ల సంఖ్య: 60
యూనిట్-I
రాజనీతి - నన్నయ
మహాభారతం- సభాపర్వం- ప్రథమాశ్వాసం- (26-57 పద్యాలు)
యూనిట్-II
నారద గాన మాత్సర్యము - పింగళి సూరన
కళాపూర్ణోదయం- ద్వితీయాశ్వాసం- (68- 101 పద్యాలు )
యూనిట్-III
ధౌమ్య ధర్మోపదేశము - తిక్కన
మహాభారతం- విరాటపర్వం- ప్రథమాశ్వాసం- (116-146 పద్యాలు)
యూనిట్-IV
పలనాటి బెబ్బులి - శ్రీనాథుడు (పలనాటి వీరచరిత్ర-ద్విపద కావ్యం పుట 108-112
'బాలచంద్రుడు భీమంబగు సంగ్రామం బొనర్చుట.. (108)
.... వెఱగంది కుంది' (112) సం. అక్కిరాజు ఉమాకాంతం
ముద్రణ. వి.కె.స్వామి, బెజవాడ 1911.
యూనిట్-V
సీతారావణ సంవాదం - మొల్ల
రామాయణము- సుందరకాండము- (40-87 పద్యాలు)
వ్యాకరణం:
సంధులు: సవర్ణ, గుణ, యణాదేశ, వృద్ధి, అనునాసిక సంధులు
అకార, ఇకార, ఉకార, త్రిక, ద్రుతప్రకృతిక
సమాసాలు: తత్పురుష, కర్మధారయ, ద్వంద్వ, ద్విగు, బహువ్రీహి.
అలంకారాలు:
శబ్దాలంకారాలు : వృత్యనుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస
అర్ధాలంకారాలు : ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, స్వభావోక్తి, అతిశయోక్తి.
ఛందస్సు:
వృత్తాలు: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము;
జాతులు: కందం, ద్విపద
ఉపజాతులు: ఆటవెలది, తేటగీతి, సీసం
ఆధార గ్రంథాలు:
1. శ్రీమదాంధ్ర మహాభారతము : సభాపర్వము- తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ
2. శ్రీమదాంధ్ర మహాభారతము : విరాటపర్వము- తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ
3. కళాపూర్ణోదయం - పింగళి సూరన
4. పలనాటి వీరచరిత్ర - శ్రీనాథుడు
5. రామాయణము - మొల్ల
అంశం: జనరల్ తెలుగు సెమిస్టర్- 2
కోర్సు- 2 : ఆధునిక తెలుగు సాహిత్యం
యూనిట్ల సంఖ్య: 5 పీరియడ్ల సంఖ్య: 60
పాఠ్య ప్రణాళిక
యూనిట్-I: ఆధునిక కవిత్వం
1. ఆధునిక కవిత్వం - పరిచయం
2. కొండవీడు - దువ్వూరి రామిరెడ్డి
('కవికోకిల' గ్రంథావళి-ఖండకావ్యాలు-నక్షత్రమాల సంపుటి నుండి)
3. మాతృసంగీతం - అనిసెట్టి సుబ్బారావు
('అగ్నివీణ' కవితాసంపుటి నుండి)
4. 'తాతకో నూలుపోగు' - బండారు ప్రసాదమూర్తి
('కలనేత' కవితాసంపుటి నుండి)
యూనిట్-II: కథానిక
5. తెలుగు కథానిక - పరిచయం
6. భయం (కథ) - కాళీపట్నం రామారావు
7. స్వేదం ఖరీదు.....? - (కథ) - రెంటాల నాగేశ్వరరావు
యూనిట్-III: నవల
8. తెలుగు 'నవల' - పరిచయం
9. రథచక్రాలు (నవల) - మహీధర రామ్మోహన రావు (సంక్షిప్త ఇతివృత్తం మాత్రం)
10. రథచక్రాలు (సమీక్షా వ్యాసం) - డా|| యల్లాప్రగడ మల్లికార్జునరావు
యూనిట్-IV: నాటకం
11. తెలుగు 'నాటకం' - పరిచయం
12. యక్షగానము (నాటిక) - ఎం.వి.ఎస్. హరనాథరావు.
13.“అపురూప కళారూపాల విధ్వంసదృశ్యం 'యక్షగానము' (సమీక్షా వ్యాసం) -డా||కందిమళ్ళ సాంబశివరావు
యూనిట్-V: విమర్శ
14. తెలుగు సాహిత్య విమర్శ - పరిచయం
15. విమర్శ-స్వరూప స్వభావాలు; ఉత్తమ విమర్శకుడు-లక్షణాలు
ఆధార గ్రంథాలు/వ్యాసాలు:
1. ఆధునిక కవిత్వం-పరిచయం : చూ. 'దృక్పథాలు' పుట 1-22, ఆచార్య ఎస్వీ. సత్యనారాయణ
2. తెలుగు కథానిక-పరిచయం : చూ. మన నవలలు-మన కథానికలు, పుట 118-130,
ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
3. తెలుగు నవల-పరిచయం : చూ. నవలాశిల్పం, పుట 1-17, వల్లంపాటి వెంకటసుబ్బయ్య
4. తెలుగు నాటకం-పరిచయం : చూ. తెలుగు నాటకరంగం, పుట 17-25 ఆచార్య ఎస్.గంగప్ప
5. తెలుగు సాహిత్య విమర్శ-పరిచయం: చూ. తెలుగు సాహిత్య విమర్శ-నాడు,నేడు పుట 213-217
తెలుగువాణి, అయిదవ అఖిలభారత తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం
6. నూరేళ్ళ తెలుగు నాటక రంగం - ఆచార్య మొదలి నాగభూషణశర్మ
7. నాటకశిల్పం - ఆచార్య మొదలి నాగభూషణశర్మ
8. సాంఘిక నవల-కథన శిల్పం - ఆచార్య సి.మృణాళిని.
Faculty Information
Name: Dr. Kola Sekhar, HOD Qualification: MA (Telugu), M.Phil, Ph.D, UGC-NET, PGDCA Mobile No: 9441441097 Mail: kolasekhara@gmail.com Name:D...
-
తెలుగు శాఖ Year of Establishment : Dec. 9, 1954 Courses offered : GENERAL TELUGU ( I, II ...
-
లింకులు : వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాల వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల/తెలుగు వికీపీడియా:వికీప్రాజెక్టు/...




